calender_icon.png 26 November, 2025 | 6:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డీలేని రుణపరిమితిని రూ.20 లక్షల వరకు పెంచాలి

26-11-2025 12:00:00 AM

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల,నవంబర్ 25 సిద్దిపేట జిల్లా ముస్త్యాల గ్రామానికి చెందిన రైతు వేదిక లో చేర్యాల కొమురవెల్లి మద్దూర్ దుల్మిట్ట మండలాలకు చెందిన మహిళల స్వయం సహాయక సంఘాలకు ఒక కోటి యాభై ఐదు లక్షలవడ్డిలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా హైమావతి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వడ్డిలేని రుణాల పథకం గతంలో బారసా ప్రభుత్వం ప్రారంభించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు.

20 లక్షల రుణం తీసుకున్న మహిళలకు కేవలం ఐదు లక్షలకే వడ్డిలేని రుణం వర్తించడం కాకుండా ఆ పరిమితిని మహిళల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరింతగా పెంచాలని మహిళల తరఫున ప్రభుత్వాని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సంకల్పం ఉంటే మనకు తోడుగా తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఆర్డీవో చేర్యాల తహసిల్దార్ మండల సమాఖ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.