calender_icon.png 26 November, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపల పెంపకం ద్వారా గిరిజనులు ఆర్థికంగా ఎదగాలి

26-11-2025 12:00:00 AM

ఎంపిడిఓ బద్రు నాయక్

మంగపేట నవంబర్ 25(విజయక్రాంతి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పెంపకం ద్వారా ఆదివాసీ గిరిజనులు ఆర్థికంగా ఎదగాలని ఎంపీడీఓ భద్రునాయక్ అన్నారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీ లలోని 73 చెరువులకు గాను 16 లక్షల 53 వెల ఉచిత చేప పిల్లలను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు పెస మొబిలైజర్లకు గిరిజన మత్స్య సంఘాల అధ్యక్షులకు పంపిణి చేయడం జరిగిందన్నారు.

ఇందులో మూడు రకాల చేప పిల్లలు బొచ్చ రవ్వ బంగారు తీగ లాంటి రకాలను 16 గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల కు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఐటిడిఏ పెస జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ మత్స్య శాఖ క్షేత్ర అధికారి రమేష్ సిబ్బంది మౌనిక నిహారిక పంచాయతీ కార్యదర్శులు రాజేష్  పెస మొబిలైజర్లు జోగ నరేంద్ర తాటి విజయ్ పోదేం నాగేశ్వరావు సాలం బాబు సుమలత 25 గ్రామ పంచాయతీ ల మొబిలైజర్లు పాల్గొన్నారు.