calender_icon.png 26 November, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండేళ్ల చిన్నారికి అరుదైన చికిత్స

26-11-2025 12:00:00 AM

సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్‌లో నిర్వహణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి):మెడికవర్ హాస్పిటల్స్ సికిం దరాబాద్‌లో అత్యంత క్లిష్టమైన న్యూరోలాజికల్ పరిస్థితి అయిన కాంప్లెక్స్ (మల్టిలో క్యు లేటెడ్) హైడ్రోసెఫలస్ కారణంగా అరుదుగా కనిపించే ‘బాబుల్-హెడ్ డాల్ సిండ్రోమ్’తో బాధపడుతున్న 2ఏళ్ల చిన్నారికి విజయవంతమైన శస్త్రచికిత్స నిర్వహించారు. హైడ్రో సెఫలస్ సాధారణంగా మెదడులోద్రవం పేరుకుపోవడంగా గుర్తింపు పొందినప్పటికీ, కాంప్లెక్స్ హైడ్రోసెఫలస్ అత్యంత క్లిష్టమైన రకం.

ఇందులో మెదడులోని ద్రవం అనేక విడిపోయిన గదుల్లో చిక్కుకుపోయి తీవ్రమై న ఒత్తిడి, అభివృద్ధిలో ఆలస్యం, శస్త్రచికిత్స కు పెద్ద సవాళ్లు ఏర్పడతాయి. చిన్నారి నిరంతరంగా ‘నో-నో’లా తల ఊపడంతో కుటుం బ సభ్యులు ఆందోళన చెంది ఆస్పతికి తీసు కొచ్చారు. మెడికవర్లో చేసిన శాస్త్రీయ పరిశీలనలో ఇది బాబుల్-హెడ్ డాల్ సిం డ్రోమ్ స్పష్టమైన లక్షణమని గుర్తించి, మల్టిలోక్యులేటెడ్ హైడ్రోసెఫలస్గా నిర్ధారించారు.

మెడికవర్ న్యూరోసర్జరీ బృందం న్యూరో-నా విగేషన్తో కూడిన అధునాతన న్యూరో-ఎం డోస్కోపీ ద్వారా మెదడులోని లోతైన విభాగాలను ఖచ్చితంగా చేరుకుని విడిపోయిన లోక్యులేషన్లను తొలగించి, దీర్ఘకాలిక నియంత్రణకుప్రోగ్రామబుల్ వీపీ షంట్ అమ ర్చా రు. డా.రమేష్ శిఘకొల్లి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, డా.భవాని శంకర్ శ్రీనివాస్, చీఫ్ అనస్తీటిస్ట్, హెచ్‌ఓడీ,  చికిత్స బృందంలో ఉన్నారు.