10-08-2025 12:56:54 AM
గౌరి ఫిలింస్‌తో కలిసి సుఖకర్త ఫిలింస్ బ్యానర్ రూపొందిస్తున్న తొలిచిత్రం ‘పెళ్లిలో పెళ్లి’. శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణుప్రియ, ఉమామహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తుండగా, గణేశ్ కోలి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోపాటు బ్యానర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాశ్ జగన్నాథ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి మ్యూజిక్: ఎంఎల్ రాజా; డీవోపీ: శుభం గుండ్ల; ఆర్ట్: వేణుగోపాల్ ప్రశాంత్.