calender_icon.png 20 May, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

20-05-2025 01:20:56 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మే 19 ( విజయక్రాంతి ) : జిల్లాలో మే 22వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను సంబంధిత శాఖలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐడిఓసి లోని ప్రజావాణి హాల్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 22 నుండి ప్రారంభమయ్యే అడ్వాన్స్ స ప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు తమ బాధ్యతల ను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 3631 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరానికి సంబంధించి 2092 మంది విద్యార్థులు,

మొత్తంగా 5723 (జనరల్, ఒకేషనల్) విద్యార్థులు పరీక్షలకు  హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అతను కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.