08-09-2025 12:00:00 AM
ఇల్లెందు, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ఇల్లందు ఏరియా జి.యం వి.కృష్ణయ్య ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసులకు జి. యం కార్యాలయంలో ఆదివారం ముఖాముఖీ (ఇంటర్వ్యూ) నిర్వహించారు. ఈ సందర్భముగా డి.జి.యం.(పర్సనల్) అజ్మీర తుకారాం, జే.కె.ఒసి ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ..
ఇల్లందు ఏరియా జే.కే.5 ఉపరితల గని నుండి కారుణ్య నియామకాల కొరకు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులకు వారి కుటుంబ సభ్యుల, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అన్ని వివరాలు నమోదు చేశారు. ఇంటర్వ్యూలు పూర్తి అయిన తరువాత అందరిని వైద్యపరీక్షల కొరకు పంపించి తరువాత నియామక ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ అజయ్, తదితరులు పాల్గొన్నారు.