08-09-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, సెప్టెంబర్ 07(విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఓటర్ జాబితాపై సెప్టెంబర్ 8న జి ల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ స్థానిక సంస్థలైన ఎంపిటిసి, జెడ్పిటిసి వారీగా ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ ల జాబితా త యారు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని,
దీనిపై జిల్లా స్థాయిలోని వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సెప్టెంబర్ 8న సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరే ట్ సమావేశం మందిరంలో సమావేశం ఏర్పాటు చేశామని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.