calender_icon.png 12 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయపెట్టడం కూడా ఒక కళ

12-09-2025 12:34:19 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజాచిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సాన, నిర్మాత సుస్మిత కొణిదెల అతిథులు హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో హీరో  సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “భయపెట్టడం కూడా ఒక ఆర్ట్. ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెడతాం. ఈ సినిమా చూశాక ‘కిష్కింధపురి2’ ఎప్పుడని అడుగుతారు. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల అయింది. హ్యాపీ, గర్వంగా, కొంచెం వెలితిగానూ ఉంది. అది ‘కిష్కింధపురి’తో తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు.  అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “సాయితో ఇది నా సెకండ్ ఫిలిం. మేము కలిసి చేసిన ‘రాక్షసుడు’ చాలా పెద్ద హిట్.

ఇది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పింది. చిత్ర దర్శ కుడు కౌశిక్ మాట్లాడుతూ.. “సాయి, సాహు నమ్మడం వల్ల ఈ ప్రాజెక్టు జరిగింది. అనుపమ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా వాళ్లిద్దరికీ ట్రైలర్ మేడ్. ఇద్దరు పెర్ఫార్మన్స్ చితకొట్టే శారు” అన్నారు. చిత్ర నిర్మాత సాహు మాట్లాడుతూ.. “హారర్ సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ ఇందులో హారర్ ఎలిమెంట్స్‌తోపాటు ఒక బ్యూటిఫుల్ సోల్ ఉంది.

హాలీవుడ్ మూవీ స్టాండర్డ్‌లో ఉంటుంది” అని చెప్పారు. ‘ఈ సినిమా ప్రమోషన్స్‌తో కూడా భయపడుతున్నారు. నాకు హారర్ సినిమాలు అంటే భయం. కానీ ఈ సినిమా మా నిర్మాత సాహు గురించి చూస్తాన’ని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ‘హారర్ నా ఫేవరెట్ జానర్. టైటిల్‌తోనే ఒక సూపర్ నేషనల్ వరల్డ్‌కి తీసుకెళ్లిపోయార’ని సుస్మిత కొణిదల చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, చిత్రబృందం పాల్గొన్నారు.