calender_icon.png 3 November, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..

02-11-2025 07:46:48 PM

ఉప్పల్ (విజయక్రాంతి): వైన్ షాప్, బార్ల వద్ద పార్కింగ్ చేసిన బైకులనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడే ఓ ద్విచక్రవాహనాల దొంగను నాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నాచారం ఇన్స్పెక్టర్  ధనంజయ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. మల్లాపూర్ నివాసి అయిన కేశవర్ శంకర్ సింగ్ సెప్టెంబర్ 22 తారీఖున మధ్యాహ్నం సమయంలో తన యొక్క బైక్ మల్లాపూర్ వైన్ పార్క్ వద్ద పార్క్ చేసి లోపలికి వెళ్లి బయటికి వచ్చేసరికి తన యొక్క బైకు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికిన దొరకపోవడంతో నాచారం పోలీసులకు బైకు దొంగతనమైనట్లు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు తీసుకున్న నాచారం  ఎస్సై ప్రభాకర్ రెడ్డి దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో బైకు దొంగతనం చేసింది రాజపేట మండలం యాదాద్రి భువనగిరికి జిల్లాకు చెందిన  సాయి ప్రసాద్ గా గుర్తించారు. సాయి ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఐదు మోటర్ సైకిల్ దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. బాచుపల్లి కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సాయి ప్రసాద్ బైకులు దొంగలిచ్చినట్లు ఒప్పుకున్నాడు. కేవలం వైన్ షాపులు బార్ల వద్ద పార్క్ చేసిన బైకుల టార్గెట్ చేస్తూ అట్టి బైక్లను విక్రయిస్తూ జల్సాలకు పాల్పడేవాడని నిందితుని రిమాండ్ తరలించినట్లు నాచారం ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.