11-07-2025 10:14:16 PM
కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి
బాన్సువాడ,(విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సైనికులుగా పనిచేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో శుక్రవారం కామారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుమధు సుదన్ రెడ్డి, అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో యువజన కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తాన్నారు.