22-11-2025 12:00:00 AM
సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, నవంబర్ 21(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా దర్యాప్తు జరిపి పరిష్కరించాలని సీపీ సాయిచైతన్య సంబంధిత స్టేషన్ల సిబ్బందికి సూచించారు. బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో శుక్రవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో, గ్రేవ్ కేసుల్లో వేగంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
డివిజన్? పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలన్నారు. గంజా యి, పేకాట, పీడీఎస్ బియ్యం అక్రమ రవా ణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండేలా చూడాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు..
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులపై ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు నుంచి ఛార్జీషీట్? వరకు ప్రతి విషయాన్ని కూలంకుశంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో నిర్లక్ష్యం తగదన్నారు.
ప్రతి అధికారికి సీసీటీఎన్‌ఎస్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్‌మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. కేసుల పరిష్కారంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేయాలని సూచించారు.సైబర్? నేరాలపై అవగాహన కల్పించాలి. గ్రామ పోలీస్ అధికారులు (వీపీవో) ప్రతిరోజూ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకం కావాలని సీపీ సూచించారు.
నేర నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ముందుకెళ్లాలన్నారు. సైబర్ క్రైం, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్?లైన్? మోసాలకు గురయితే 1930కు కాల్ చేసి లేదా ఎన్‌సీఆర్‌పీ లేదా https://www.cybercrime.gov. లో ఫిర్యాదు చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సీపీ సూచించారు. హైవే రోడ్లను కలుపుతూ వెళ్లే లింక్ రోడ్లకు స్పీడ్ బ్రేకర్లను వేయించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నారు. రోడ్ల విషయంలో ఇంజినీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ టెస్ట్?లు నిర్వహించాలని సూచించారు.
ఓవర్ స్పీడ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం లాంటి వాటిపై ప్రత్యేకదృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. క్రమం తప్పకుండా నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీయాక్ట్ ప్రయోగించాలని ఆదేశించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్‌హెవో వెంకట్ నారాయణ, రుద్రూర్ సీఐ కృష్ణ, బోధన్ రూరల్ ఎస్సులు మచ్చేందేర్, ఎస్సు రమ, రెంజల్ ఎస్సు చంద్ర మోహన్, కోటగిరి ఎస్సు సునీల్, రుద్రూర్ ఎస్సు సాయన్న, వర్ని ఎస్సు రామరాజు, సీసీఆర్‌బీ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.