22-11-2025 12:00:00 AM
ప్రతి ఒక్కరి బాధ్యత
పెద్దపల్లి నవంబర్ 21 (విజయ క్రాంతి) మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పెద్దపల్లి లోని బండారికుంట అంగన్వాడీ కేం ద్రంలో బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్య నేరమని, బాల్య వివాహా ల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని సాధికారత కేంద్ర కోఆర్డినేటర్ దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ సుచరిత అన్నారు.
బాల్య వివాహా నిషేధ చట్టం 2006 గురించి వివరిస్తూ ఆడపిల్ల వయస్సు 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్ళి చేసుకున్నట్ల యితే వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు. బాల్యవివాహాల వ్యతిరేకిస్తూ ప్రతి జ్ఞ చేయించారు. హెల్ప్ లైన్ నంబర్స్ గురిం చి మహిళలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సుజాత, రేఖ, శైలజ పాల్గొన్నారు.