18-07-2025 11:36:52 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు దుర్వినియోగం చేశారని, వేసవి శిబిరం కోసం వచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేశారని మంచిర్యాల పోలీస్ డిప్యూటీ కమిషనర్ భాస్కర్ కు మంచిర్యాల జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, క్రీడాకారులకు క్రీడా సామాగ్రి కానీ, వారికి శిక్షణ కార్యక్రమాలు కానీ జరపడం లేదని తెలిపారు. నిధులను వారి స్వలాభం కోసం వాడుకుంటున్నారని అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.