19-07-2025 12:00:00 AM
కామారెడ్డి, జూలై 18 (విజయ క్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఇటీవల పులుల సంచారం పెరగడంతో అటవీ శాఖ అధికారులతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు తండాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు పులి వస్తే దాడి చేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజుల క్రితం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట స్కూల్ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి అను అనువాల్లు కనిపించిన విషయం విధితమే.
పెద్దపులి ఆవు పై దాడి చేసి చంపి నా విషయం వెలుగులోకి వచ్చింది. పెద్దపులిని చంపేందుకు స్కూల్ తండాకు చెందిన నలుగురు మైపాల్ తో పాటు మరో ముగ్గురు కలిసి మైపాల్ కు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపడంతో పెద్దపులిని చంపాలని ఉద్దేశంతో ఆవుపై విషయ గుళికలు చల్లడంతో పెద్దపులి పీష గుళికలు తిన్నదని ప్రచారం కొనసాగింది.
దీంతో వన్యప్రాణి అయిన పెద్ద పులిని చంపే ప్రయత్నం చేశారని నేపంతో అటవీ శాఖ అధికారులు రెడ్డిపేట స్కూల్ తండా చెందిన మైపాల్ తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి మూడు నాలుగు రోజులపాటు అటవీశాఖ అధికారులు రెస్క్యూ టీం పెద్ద పులి కోసం గాలింపు చర్యలు అటవీ ప్రాంతంలో చేపట్టారు. పెద్దపులి మాత్రం చనిపోలేదని తేల్చారు.
ఎక్కడో వెళ్లిపోయిందని భావించిన అటవీశాఖ అధికారులకు గురువారం రాత్రి ఇదే మండలంలోని రామారెడ్డి మండలం గోకుల్ తండా కు చెందిన పీరియాకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. ఆవు పై దాడి చేసింది పెద్దపులి అని తండావాసులు భావించారు. అటవీ శాఖ అధికారులు మాత్రం పెద్దపులి చంపలేదని చిరుత పులి ఆవును చంపిందని మానవాళి కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
స్థానికులు మాత్రం పెద్దపులి వచ్చి చంపిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆట వి శాఖ అధికారు లు రెస్క్యూ టీం తో గోకుల్ తండా, రాజమ్మ తండా, సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత పులి కోసం గాలిస్తున్నారు. మాచారెడ్డి, రామారెడ్డి, మాచారెడ్డి, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలో అటవీ ప్రాంతం ఉంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా లోని గజ సింగవరం, వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.
ఈ అడవుల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. పెద్దపులి మాత్రం అటవీ ప్రాంతంలోకి రావడం ఇదే మొదటి సారి అని అటవీశాఖ అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల అటవీ ప్రాంతాల గుండా నిజామాబాద్ జిల్లా సిరికొండ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట స్కూల్ తండా సమీపానికి గత వారం రోజులు క్రితం పెద్దపులి వచ్చి ఆవుపై దాడి చేసి చంపి వేసిన విషయం విధితమే.
దీంతో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అటవీశాఖ అధికారులు అడవుల్లో గాలింపు చర్యలో ముమ్మరంగా చేపట్టారు. గత వారం రోజులుగా అడవుల్లో రెస్క్యూ టీంలు సంచరిస్తూ జల్లెడ పడుతున్న పెద్దపులి జాడ మాత్రం కనుక్కోలేదు. అడవుల్లో ఏర్పాటు చేసిన ప్లై యాష్ కెమెరాల్లో పెద్దపులి ఆనవాళ్లు చిక్కలేదని అటవీశాఖ అధికారులు చెబుతుండగా, మరో కొందరు మాత్రం ఫ్లాష్ కెమెరాలు లో పెద్దపులి ఆనవాళ్లు చిక్కిన బయటకు చెప్పడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెద్దపులి చనిపోయిందని భావించిన స్థానికులు, అటవీ శాఖ అధికారు లు మాత్రం సేఫ్ గా పెద్దపులి ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. గురువారం రాత్రి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా అటవీ ప్రాంతంలో గోకుల్ తండకు చెందిన పీరి యా నాయక్ తన ఆవును తన చేనులో కట్టివేసి రాగా గురువారం రాత్రి చిరుత పులి వచ్చి దాడి చేసి చంపేసింది.
దీంతో గోకుల్ తండా, రాజమ్మ తండా లవాసు లే కాకుండా రెడ్డి పేట స్కూల్ తండా, మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాలు తండాల ప్రజలు పెద్ద పులి వస్తుందా చిరుత పులి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో పశువులను మేపేందుకు వెళ్లేందుకు తండవాసులు జంకుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో చిరుత పులుల సంచారం ఉమ్మడి జిల్లాల అటవీ అధి కారులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
వరుసగా చిరుతలు పశువులపై మేకల మందల పై దాడులు చేసి చంపి వేస్తుండడంతో ప్రజలు వెళ్లిన పులులు దాడులు చేస్తాయేమో నన్ను ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు మాత్రం అడవుల్లోకి ఎవరు వెళ్ళవద్దని అవగాహన కల్పిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు, రేస్ క్యూ టీములు అడవుల్లో జల్లెడ పడుతున్నాయి. పులుల జాడ కోసం ఒకవైపు వెతుకుతుండగా, మరోవైపు చిరుతలు ఆవులపై దాడులు చేసి చంపడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
అటవీశాఖ అధికారులు సైతం ఎన్నో భద్రతలు చర్యలు ఒకవైపు తీసుకుంటున్న చిరుతల సంచారం తో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చిరుతలను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారం రోజుల్లోనే పెద్ద పులి సంచారం చిరుత పులి సంచారం చేసి ఆవుల పై దాడులు చేయడం అటవీశాఖ అధికారులకు తలనొప్పి తెచ్చిపెట్టాయి.
మరోవైపు నిజాంబాద్ సమీపంలోని అడవుల్లో మేకల మందపై చిరుత దాడి చేయడమే కాకుండా ఆవుపై కూడా దాడి చేసి చంపి వేశాయి. ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో చిరుత పులి ల సంచారంతో పాటు పెద్దపులి మొదటిసారి జిల్లాలో సంచరించడం ఉమ్మడి జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
పెద్దపులి కాదు... చిరుత పులి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండా అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి ఆవుపై దాడి చేసింది చిరుత పులి మాత్రమేనని పెద్దపులి కాదని అటవీశాఖ జిల్లా అధికారి రామకృష్ణ విజయక్రాంతితో తెలిపారు. ప్రజలు పెద్దపులి అని అంటున్నారు కానీ తమ సిబ్బందితో అడవిలో వేలిముద్ర లను సేకరించగా చిరుత పులి దాడి చేసినట్లు ఆనవాళ్లు లభించాయని ఆయన తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత పులి లను పట్టుకోవడానికి బోనులను అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమ అటవీ శాఖ సిబ్బంది మాత్రం పులుల జాడ కోసం రెస్క్యూటీంలు అడవుల్లో సంచరిస్తున్నాయని తెలిపారు. పెద్దపులి జాడ మాత్రం కనిపించడం లేదని తెలిపారు.
రామకృష్ణ,
జిల్లా అటవీశాఖ అభివృద్ధి అధికారి,
కామారెడ్డి,