13-05-2025 01:18:01 AM
- మ్యాచ్‌లు ఆరు నగరాలకే పరిమితం
- మొత్తం 17 మ్యాచ్‌లు.. వచ్చే నెల 3న ఫైనల్స్
న్యూఢిల్లీ, మే 12: పాక్ భారత్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఇండి యన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లకు వారం పాటు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో (బీసీసీఐ) బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా తిరిగి ఐపీఎల్ మ్యాచ్‌ల కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 17 నుం చి మ్యాచ్‌లు తిరిగి ప్రారంభ మవు తాయి. క్రికెటర్లు మొత్తం 17 మ్యా చ్‌లు ఆడనున్నారు. అయితే.. ఈసా రి మ్యాచ్‌లు లక్నో, ఢిల్లీ, ముంబై, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకే పరిమితం. ఈనె 29న క్వాలిఫయర్ మ్యాచ్, 30న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనున్నది. జూన్ 2న క్వాలిఫయర్ వొ మ్యాచ్, ఆ మరుసటి రోజే ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది.