24-11-2025 12:00:00 AM
సుల్తానాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న శ్వేత శ్రీ 69వ రాష్ట్రస్థాయి ఎస్‌జిఎఫ్ అండర్ 17 బాలికల విభాగంలో పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యం ఆదివారం తెలిపారు. ఇటీవల మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికైనట్లు,
ఈ నెల 23 నుంచి 25 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగనున్న రాష్ట్ర పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ లు శ్వేతశ్రీ ని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం,శివ, సతీష్,మమత విద్యార్థిని పాల్గొన్నారు.