calender_icon.png 24 November, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా పైరసీ తగ్గేదేలే!

24-11-2025 12:00:00 AM

-ఐబొమ్మ పోయినా.. మూవీ రూల్జ్ ఆగలే

-నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పైరసీ భూతం

- శుక్రవారం రిలీజైన చిత్రాలన్నీ మరునాడే హెచ్‌డీ ప్రింట్‌లో లభ్యం

-విచారణకు సహకరించని రవి.. రంగంలోకి ఎథికల్ హ్యాకర్లు

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 23 (విజయక్రాంతి): తెలుగు చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతం వదలడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, సైబర్ కేటుగాళ్లు కొత్తదారుల్లో సినిమాలను లీక్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన ఐబొమ్మ, బప్పం వంటి వెబ్‌సైట్లను పోలీసులు బ్లాక్ చేసి, నిర్వాహకుడిని అరెస్ట్ చేసినప్పటికీ, మూవీ రూల్జ్ రూపంలో పైరసీ దందా కొనసాగుతో ంది.

తాజాగా శుక్రవారం విడుదలైన చిన్న, మధ్య తరహా చిత్రాలు మరుసటి రోజే మూ వీరూల్జ్‌లో ప్రత్యక్షమవ్వడం నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తోంది. అల్లరి నరేశ్ నటించిన 12ఏ రైల్వే కాలనీ, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే వం టి చిత్రాలను పైరసీ చేసిన నిర్వాహకులు, హెచ్‌డీ ప్రింట్లను వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేశారు. రూ.కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తే, విడుదలైన వెంటనే పైరసీ బారిన పడటంతో నిర్మాతలు తలలు పట్టుకుంటు న్నారు. మూవీ రూల్జ్ నిర్వాహకులను పట్టుకునేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.

విచారణలో రవి మౌనం.. సీపీ ఎంట్రీ

మరోవైపు, ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీ విచారణ కొనసాగుతోంది. కస్టడీలో భాగంగా 3వ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్వయంగా రవిని విచారించారు. అయితే, రవి పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోం ది.

సీపీ అడిగిన ప్రశ్నలకు కూడా పొం తన లేని సమాధానాలు చెబుతూ, గుర్తులేదు అంటూ దాటవేస్తున్నట్లు సమాచారం. ము ఖ్యంగా రవి ఉపయోగించిన సర్వర్లు, క్లౌడ్ స్టోరేజీ వివరాలపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. దీంతో డిజిటల్ సాక్ష్యాలను రాబట్టేందుకు, సర్వర్ల గుట్టు విప్పేందుకు ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు.