29-12-2025 06:26:17 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాల కు చెందిన 9 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ కృష్ణప్రియ సోమవారం తెలిపారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ , ప్రిన్సిపల్ కృష్ణప్రియ విద్యార్థుల ను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్లో షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ స్త్రీ, పురుషుల షూటింగ్ బాల్ పోటీలలో తమ విద్యార్థులు పాల్గొన్నారని, వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీలు ఈనెల 30,31, జనవరి 1వ తేదీలలో వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్లో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని,క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు.