29-12-2025 06:30:38 PM
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని 3వ వార్డులో సోమవారం సర్పంచ్ చునార్కర్ సతీష్ ఆధ్వర్యంలో సోమవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పూడికతో నిండిన కాలువల్లో పూడిక తీత పనులను చేపట్టారు. అలాగే వాడలో ఉన్న చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి శివకుమార్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు సభ్యుడు రాము, సఫాయి కార్మికులు ఉన్నారు.