ఈ లక్షణాలు ఉంటే, ఐరన్ లోపం ఉన్నట్టే

29-04-2024 12:05:00 AM

ఐరన్ లోపం ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం ఐరన్. మన రోగ నిరోధక వ్యవస్థకు, మెదడు పనితీరుకు, మానసిక పరిస్థితికి, కండరాలు బలంగా ఉండడానికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి శరీరంలో సరిపడా ఐరన్ ఉండాలి. ఐరన్ లోపం వల్ల శరీరం సమర్థంగా పూర్తిస్థాయిలో పనిచేయలేదు. పిల్ల ల్లో మెదడు ఆరోగ్యంగా ఎదగడానికి ఐరన్ చాలా అవసరం. అయితే ఐరన్ లోపం ఉంది అని తెలుసుకోవడం ఎలా? అంటే ఐరన్ లోపం ఉన్నవారిలో కొన్ని లక్షణాలు బాగా కనిపిస్తాయి.

ఈ లక్షణాలు ఉంటే  ఐరన్ లోపం నుంచి బయట పడటానికి కావలసిన ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఐరన్ లోపం ఉన్న వారిలో థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. దానివల్ల హైపోథైరాయిడిజం అనే కొత్త సమస్య వారిలో ఉత్పన్నమవుతుంది. మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొ ప్పి అదేపనిగా వస్తూ ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవాళ్లలో గుండె వేగంగా కొట్టుకుంటుంది, బరువు పెరుగుతుండడం, శరీరం చల్లగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బీట్ రూట్, దానిమ్మలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల బీట్‌రూట్‌లో 0.8 గ్రాముల ఐరన్, 100 గ్రాముల దానిమ్మలో 0.3 మిల్లీగ్రాముల ఐరన్ మాత్రమే ఉంటుంది. బీట్‌రూట్‌లో ఫైటోసైనిన్ అనే పదార్థం ఉంటుంది. దానిమ్మలో ఆంథోసైనిన్ కారణంగా ఎర్రగా ఉంటుంది. అయితే, బాడీలో ఐరన్ లోపం తగ్గుతుంది.  బచ్చలికూరలో విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శరీరా నికి అవసరమైన పోషకాలు ఉంటా యి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది.  ఆకుకూరలు, పప్పుధాన్యాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కాబట్టి, పప్పులు తీసుకోవడం మంచిది. అయితే టీ, కాఫీ ఐరన్‌ని శరీరం శోషించుకోకుండా నిరోధిస్తాయి. కాబట్టి ఐరన్  నిండిన ఆహారాలు తింటున్నప్పుడు వీటన్నింటికీ దూరంగా ఉండాలి.