calender_icon.png 9 September, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినతులను తక్షణమే పరిష్కరించాలి

09-09-2025 12:11:59 AM

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8: ప్రజావాణిలో వచ్చే వినతులను తక్షణమే పరిష్కరించాలనీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులకు అదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (64) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి,నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూపరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ 42, ఇతర శాఖలు  22, మొత్తం 64  దరఖస్తులు అందాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.