calender_icon.png 2 May, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం

02-05-2025 12:57:49 AM

  1. తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

గోపాలపేట  మే1 : వనపర్తి జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు విఫలం అయ్యారని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆరోపించారు. గురువారం గోపాలపేట మండలం బుద్దారం గ్రామం లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా రైతులు తమ గొడును. జేఏసీ చైర్మన్తో వెలిబుచ్చారు. అనంతరం  రాచాల మాట్లాడుతూ .

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చి పక్షం రోజులు కావస్తున్నా అధికారులు తూకాలు చేయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క మేఘాలు కమ్ముకుంటూ ఈదురు గాలులు వీస్తూ ఆకాల వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా నాయకులు రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదని.. ఉపన్యాసాలు ఇస్తున్నట్లుగా అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారం భించేటప్పుడు అధికారులు ప్రతీ గింజ కొంటామని చెబుతుంటారని, కానీ అమలైనా దాఖలాలు లేవన్నారు.కొనుగోలు కేం ద్రం వద్ద అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, గన్నీ బ్యాగుల కొరత ఉందని, కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని, కేంద్రాలను అధికారులు పరిశీలించిన సంఘటనలే లేవన్నారు.

డీఎస్‌ఓ నిర్లక్ష్యం కారణంగానే ధాన్యం కొనుగోలు జరగడం లేదని, దీనిపై కలెక్టర్ గారు కలుగజేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగ యాదవ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుకు రేనట్ల మల్లేష్, ఆర్టీఐ విభాగం ఉపాధ్యక్షులు రాఘవేందర్,  పెద్దమందడి మండల అధ్యక్షుడు రమేష్ సాగర్, స్థానిక రైతులు రాములు, సత్యం గౌడ్ పాల్గొన్నారు.