26-08-2025 02:43:31 AM
ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి): ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ తమ కొత్త మెడికవర్ క్లినిక్స్‌ను ఏఎస్‌రావునగర్ హైదరాబాద్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్, జీహెఎంసీ వార్డు 2 కార్పొరేటర్ సింగిరెడ్డి సిరిషా, బీఆర్‌ఎస్ పార్టీ లీడర్ సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ క్లినిక్‌లో కార్డియాలజీ, ఇంటర్నల్ మెడిసిన్, న్యూరాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ, గాస్ట్రోఎంటరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. “ఏఎస్‌రావునగర్‌లో మెడికవర్ క్లినిక్స్ ప్రారంభం చాలా సంతోషకరమైన విషయం. స్థానిక ప్రజలకు సమీపంలోనే నిపుణుల వైద్య సేవలు అందించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది” అన్నారు. సింగిరెడ్డి సిరిషా మాట్లాడుతూ.. “మన ప్రాంతంలో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉండటం చాలా అవసరం.
ఏఎస్ రావు నగర్‌లో మెడికవర్ క్లినిక్స్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు” అన్నారు. సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. “మెడికవర్ ఆసుపత్రులు ఇప్పటికే ప్రజల్లో విశ్వాసాన్ని పొందాయి. ఈ కొత్త క్లినిక్ ద్వారా ఏఎస్‌రావు నగర్, సమీప కాలనీల ప్రజలు సమీపంలోనే నిపుణుల సేవలు పొందగలరు” అన్నారు.
మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ డెగ్లూర్కర్ మాట్లాడుతూ.. “ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం, రోగి స్నేహపూర్వకంగా చేయడం మా దృష్టి. ఈ కొత్త క్లినిక్ ప్రారంభం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు” అన్నారు.