17-05-2025 01:13:13 AM
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారకరామా రావుపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్ మండిపడ్డారు. ప్రపంచ సుందరీమణులు వాళ్లకు వాళ్లు కాళ్లు కడు క్కున్నా.. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అబద్దపు ట్వీట్ చేసి తప్పుడు ప్రచారం సాగిస్తున్నారన్నారు.
శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులకు మ తిపోయిందని, కేటీఆర్‌కు ఎర్రగడ్డలో చికిత్సకోసం సహా యం చేస్తామని పేర్కొన్నారు. అహ ంకారానికి ఐడీ కార్డు, దుహంకారానికి ఆధార్‌కార్డు బీఆర్‌ఎస్ అని ఆరోపించారు.
ప్రపంచ స్థాయిలో రాష్ట్రాన్ని ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రయత్నం చేస్తున్నారని, సీఎంకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి బీఆర్‌ఎస్ ఓర్చుకోలేకే ఇలా చేస్తుందని దుయ్యబట్టారు.