calender_icon.png 20 May, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ అమెరికా షి‘కారు’ అందుకేనా!

20-05-2025 01:37:26 AM

సభ జరిగిన నాటి నుంచి ఇక గులాబీ దళపతి కేసీఆర్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. కుమారుడు కేటీఆర్‌కు, కుమార్తెకు కవితకు ఏమాత్రం పడడం లేదని, హరీశ్‌రావు కూడా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నాడనే వార్తలు కేసీఆర్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయని తెలిసింది. పైైకి అందరూ ఐకమత్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతునట్టు తెలుస్తోంది.

తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు పే రుంది. పాతికేళ్ల క్రితం గుప్పెడు మందితో ప్రారంభమైన పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది. పార్టీ ప్రారంభమైన సమయంలో సరైన ఆర్థిక వనరులు కూడా కేసీఆర్ వద్ద లేవు. ఒక బక్కపలచని మనిషి ఏం చేస్తాడు లే? అంటూ నాటి పాలకులు ఆయన్ను చిన్నచూపు చూశారన్నది అక్షరాలా నిజం. అలాంటి కేసీఆర్ అకుంఠిత దీక్షతో తెలంగాణ నినాదాన్ని భుజానికెత్తుకున్నారు.

ఎన్నో అవమానా లు చవిచూశారు. ఎన్నో పార్టీలతో జతకట్టారు. కింద పడ్డారు.. లేచారు. ఉద్యమిం చారు. జనాన్ని కూడగట్టారు. అందరితో ‘ప్రత్యేక తెలంగాణ కావాలి’ అని నినదించేలా చేశారు. ఏ మైతేనేం.. మొత్తానికి కేంద్రం దిగివచ్చింది. చివరకు తెలంగాణ కల సాకారమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రయ్యారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించా రు. ఇంకొంత కాలంలో అసెంబ్లీ ఎన్నికలొస్తాయనగా..

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అనే తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)గా మార్చారు. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అన్న నినాదంతో స్థాపించిన తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్‌ఎస్)ను భారత రాష్ర్ట సమితి (బీఆర్‌ఎస్)గా చెడ్డ నామకరణం చేసి రాష్ట్ర ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు కేసీఆర్. వలసలను ప్రోత్సహించిన పార్టీగానూ బీఆర్‌ఎస్ పేరు తెచ్చుకున్నది.

కారణాలు  ఏమైతేనేం.. తర్వాత ఓటర్లు బీఆర్‌ఎస్ పాలనకు అడ్డంగా బ్రేక్ వేశారు. ఓట్లేసి కాంగ్రెస్‌కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. కేసీఆర్ పదవీచ్యుతుడై ఫాం హౌస్‌కు పరిమితమయ్యారు. ఇదంతా జరిగే సరికి గులాబీ పార్టీకి కూడా నిండా పాతికేళ్లు వచ్చేశాయి. ఓరుగల్లుకు కూతవే టు దూరంలోని ఎల్కతుర్తిలో అట్టహాసం గా రజతోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత కేసీఆర్ సభావేదికగాపై గర్జిస్తారనుకుంటే.. అంతమేరకు కాకపోయి నా, కొంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రసంగం బాగా నే పండింది.

అప్పటివరకు నిశబ్దంగా ఉం డి, ఒక్కసారి అలా తనదైన శైలిలో వాక్బాణాలు సంధించడాన్ని ప్రజలు కూడా స్వా గతించారు. ఇది ఒకవైపు అయితే.. సభ జరిగిన నాటి నుంచి గులాబీ దళపతి కేసీఆర్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. కుమారుడు కేటీఆర్‌కు, కుమార్తెకు కవితకు ఏమాత్రం పడడం లేదని, హరీశ్‌రావు కూడా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నాడనే వార్తలు కేసీఆర్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయని తెలిసింది. పైైకి అందరూ ఐకమత్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతునట్టు తెలుస్తోంది.

ఫ్లెక్సీల వివాదం.. 

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ జరిగిన రో జు పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబంధించిన ఫ్లెక్సీలే ఆ ప్రాంతంలో కనిపించాయి. మాటవరసకు కూడా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత, ఆ పార్టీ నేత, ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్‌రావు ఫ్లెక్సీలు కనిపించకపోవడం పెద్ద దుమారానికి దారితీసింది. అంతేకాదు.. సభా ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు కేటీఆర్‌తో పాటు స్థానిక నేత లే దగ్గరుండి వాటిని పర్యవేక్షించారు త ప్ప..

హరీశ్‌రావు అటువైపు వచ్చి న దాఖలాలు లేవు. ఇదే అంశంపై కొన్నిమీడియా సంస్థలు ‘హరీశ్‌రావు ఎక్కడ??’  అనే శీర్షికలతో కథనాలు కూ డా వడ్డించాయి. ఇదే ఉదుటన కొంతకాలంగా హరీశ్‌రావు ముభావంగా ఉంటున్నారనే వా ర్తలు కూడా ఊపందుకున్నాయి. కేటీఆర్ ఇటీవల హరీశ్‌రావు ఇంటికి వెళ్లడం పెద్ద సంచలనంగా మారింది.

కేటీఆర్ ఆ ఇంటికి వెళ్లేలోపే రా ష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొన్నది. హరీశ్‌రావు పార్టీ మారతున్నారని, ఆయన్ను బుజ్జగించేందుకే బావ మరిది కేటీఆర్ రంగంలోకి దిగారని యూట్యూబర్లు వార్తలు వ్యాపించారు. నిన్నమొన్నటి వరకు లిక్కర్ కేసులో ఇరుక్కుపోయిన కుమార్తె కవితను బయటకు తీసుకువచ్చేందుకు తిప్పలు పడ్డ కేసీఆర్ ఇప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరించాల్సిన తన కుటుంబ సభ్యుల విషయంలో  ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తున్నది.

కవిత వ్యాఖ్యలపై దుమారం..

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఐదు నెలల పాటు రిమాండ్ ఖైదీ గా ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. అప్పటి నుంచి తన వ్యవహారశైలిలో మార్పులు వచ్చాయని సొంత పార్టీ నేతలే అంటున్నారు. తాను స్వయంగా నడుపుతు న్న సాంస్కృతిక సంస్థ ‘తెలంగాణ జాగృతి’పై దృష్టి సారించారు. ఊరూరా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. జాగృతి కార్యకర్తలను స్వయంగా కలిశారు.

వారి మం చిచెడులను చూసుకున్నారు. ఆమె వైఖరిని చూసి జాగృతి సంస్థను బీఆర్‌ఎస్‌కు స మాంతరంగా అభివృద్ధి చేస్తున్నారని కొం దరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. మే డే సందర్భంగా ఈ నెల 1వ తేదీన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కవిత తన ఇంట్లో తన అభిమానులో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ‘సామాజిక తెలంగాణ’ అనే కొత్త రాగాన్ని ఎత్తారు. ‘తెలంగాణ వచ్చిందని మనమందరం  అనుకుంటు న్నాం..

భౌగోళికంగా తె లంగాణ వచ్చింది గాని.. సామాజిక తెలంగాణ ఇప్పటికీ రాలేదు’ అని కుండ బద్దలు కొడుతూ చెప్పారు. ‘బీఆర్‌ఎస్ హయాంలో అనర్హులకు, లక్షాధికారలుకు కూడా రైతుబంధు అందింది.. ’ అనే అర్థం వచ్చే లా కొన్ని వ్యాఖ్యలు సైతం చేశారు. లిక్కర్ స్కాం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను బీఆర్‌ఎస్ తిప్పికొట్టలేదనేది కవిత అసంతృప్తికి కారణమని ఆమె సన్నిహత వర్గాలు చెప్తున్నట్లు తెలిసింది.

పార్టీ పగ్గాలు ఎవరికి ?

‘గులాబీ అధినేత కేసీఆర్ ఇప్పుడు పా ర్టీ పగ్గాలు  ఎవరి చేతిలో పెడతారు? ’ అ న్న అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీలో కూడా అంతర్గత చర్చ తీవ్రంగా జరుగుతున్నదని తెలిసింది. పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న తన్నీరు హరీశ్‌రావు పేరును కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. అందుకు బలమిచ్చేలా.. ఇటీవల హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రకటన చేశారు.

అదేంటంటే..? ‘కేసీఆర్ నా యకత్వంలోనే నేను ముందుకు వెళతాను. పార్టీ ఎలాంటి బాధ్యత అప్పగించి నా సవినయంగా నిర్వర్తిస్తాను’ అని ప్రకటించారు. అలా అంటూనే.. మరోవైపు కేటీఆర్‌తో తనకు ఎలాంటి పేచీలేదని చెప్పుకొచ్చా రు. ఇవన్నీ చూస్తుంటే.. వైఎస్సార్ కుటుంబంలో జగన్‌మోహన్‌రెడ్డి, షర్మిళకు మధ్య వచ్చిన తగాదాలు చివరకు ఎక్కడికి దారి తీశాయో రెండు తెలుగు రాష్ట్రాలు చూశా యి.

వాటిన్నింటికీ చెక్ పెట్టేందుకే ఇప్పుడు కేసీఆర్ అప్రమత్తమై అమెరికా యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎల్లప్పుడూ ఫాంహౌస్‌లో ఉండేందుకు ఇష్టపడే కేసీఆర్ ఇప్పుడు హఠాత్తుగా విదేశీయానం చే యడం చర్చనీయాంశమైంది. అక్కడ తనయ కవిత, తనయుడు కేటీఆర్‌ను ఒద్దికగా కూర్చోబెట్టి, వారిని బుజ్జగించి, ఎవ రికి ఏం పంపకాలు చేయాలి..అని నిర్ధారించుకుని,

ఇకముందు పార్టీని బలోపేతం చేయాలని, సామరస్యంగా ముందుకు సాగాలని..ఉద్బోధ చేస్తారని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ఇక అల్లుడు హరీశ్‌రావు సమస్యను ఎలా పరిష్కరిస్తారో మున్ముందు చూడాలి. ఏదేమై నా కేసీఆర్ తన రాజకీయ చతురతతో కు టుంబంలో చిచ్చు పుట్టకుండా, పొరపొచ్చాలకు తావు లేకుండా అందరికీ న్యా యం చేస్తారా? అనేది వేచి చూద్దాం.   

వ్యాసకర్త సెల్‌నంబర్  -98662 55355