18-05-2025 12:33:39 AM
-టికెట్ చార్జీల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
-సీఎంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల లేఖ
హైదరాబాద్,మే 17 (విజయక్రాంతి): హైదరాబాద్ ప్రజలపై తీవ్రభారం పడేలా మెట్రో టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని హైదరాబాద్ నగర పరిధి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. టికెట్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని శనివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
టికెట్ ధ రల పెంపుపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని వాపోయారు. ప్రైవేట్ కంపెనీల లాభనష్టాల ప్రాతిపదికన కాకుం డా, ప్రజల కోణంలో ఆలోచించి మెట్రోరైలు టికెట్ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర రాజధాని ప్రజలకు కాం గ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసినట్టవుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, ఆ రాష్ట్రంలో మెట్రో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. బెంగళూరులో మెట్రో ధరల పెంపుతో ప్రయాణికుల సం ఖ్య 13 శాతం తగ్గిపోయిందన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో, అక్కడి ప్రభు త్వం వెనక్కి తగ్గిందన్నారు.