calender_icon.png 26 November, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల ‘పంచాయతీ’ నాయకత్వం ప్రశ్నార్థకం?

26-11-2025 12:00:00 AM

  1. జిల్లాల వారీగా బీసీ రిజర్వేషన్‌లో భారీ అసమానతలు
  2. నోటిఫికేషన్‌పై భిన్న వాదనలు
  3. భద్రాద్రి కొత్తగూడెంలో బీసీలకు ఒక్క పంచాయతీ లేదు
  4. మొత్తం 12,735లో కేవలం 2,176 బీసీలకు రిజర్వ్
  5. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ సగటున 17.08 శాతమే

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి) :  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల గెజిట్ ఆధారంగా బీసీలకు రిజర్వ్ అయిన స్థానాలపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ల కోసం బీసీలు పోరాటం చేస్తుం టే, దానికి పూర్తి భిన్నంగా ప్రస్తుతం రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితులు కనిపిస్తు న్నాయి. రాష్ట్రంలో బీసీలు 50 శాతానికి పైగా ఉండగా ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో సగటున కేవలం 17.08 శాతం మాత్రమే బీసీలకు దక్కుతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.

జిల్లాల వారీగా గణాంకాలను గమ నిస్తే బీసీల రిజర్వేషన్లలో భారీ అసమానతలు తలెత్తాయి. తెలంగాణలో గ్రామ పంచా యతీల రిజర్వేషన్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగినట్లే గణాంకాలు చెబుతున్నాయి. రాష్ర్టవ్యాప్తంగా 12,735 గ్రామపం చాయతీల్లో కేవలం 2,176 మాత్రమే బీసీలకు రిజర్వ్ అయినట్టు తెలుస్తోంది. మొత్తం పంచాయతీల్లో ఇది కేవలం 17.08 మా త్రమే.

ఈ నేపథ్యంలో పంచాయతీల్లో బీసీలకు దక్కిన స్థానాలు, ప్రభుత్వం చేస్తున్న వాదనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని బీసీ వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తతున్నా యి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో బీసీలకు గ్రామ స్థాయి నాయకత్వమే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కొన్ని జిల్లాల్లో అత్యల్పం

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా భద్రాద్రి కొత్తగూడెంలో 471 పంచాయతీలు ఉం డగా, ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ కాలేదు. మహబూబాబాద్‌లో 3.94 శాతం, ఆదిలాబాద్ 4.86 శాతం, ఆసిఫాబాద్- 5.97 శాతం, మంచిర్యాల 7.51 శాతం సీట్లు మాత్రమే బీసీలకు దక్కుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో బీసీ వర్గా లకు గ్రామస్థాయి నాయకత్వం దాదాపు లేకుండా పోతున్న పరిస్థితి నెలకొంది.

ఈ క్రమంలో సిద్ధిపేటలో 26.77 శాతం, జోగుళాంబ గద్వాల్ 27.45 శాతం, నారా యణపేటలో  26.47 శాతం, పెద్దపల్లి- 26. 23 శాతం, కరీంనగర్ 26.41 శాతమే అధికంగా బీసీలకు సీట్ల దక్కిన జిల్లాల జాబి తాలో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీల ఓటర్ల శాతం 52 శాతానికి పైగా ఉం దని, గ్రామ పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్ మాత్రమే 17 శాతానికి మాత్రమే పరిమితం కావడంపై బీసీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

జనాభా పరంగా అత్యధికంగా ఉన్న బీసీలకు అధికార భాగస్వామ్యం మా త్రం దక్కడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో బీసీ లకు దక్కిన ప్రాతినిధ్య అంశం భవిష్యత్‌లో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందని, ఇది రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభా వం చూపనున్నదని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామస్థాయిలో బీసీ నా యకులను ప్రోత్సహించే విషయంలో ప్రభు త్వం, అధికార పార్టీ విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.