26-11-2025 12:00:00 AM
శామీర్ పేట్, నవంబర్ 25: చిన్న దగ్గు పెద్ద ముప్పు అని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పల్మనరీ మెడిసిన్ హెచ్ ఓ డి డాక్టర్ శైలజ అన్నారు. మంగళవారం అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలో ధూమపానం వలన కలిగే దుష్ఫలితాలను వివరిస్తూ ఘనపూర్ లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విద్యార్థులు హెచ్ ఓ డి శైలజ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో సీఓపీడి (దీర్ఘకాలిక అబ్రస్టక్టివ్ పల్మనరీ డిసీజ్) అనే శ్వాస సంబంధిత వ్యాధి అవగాహనా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దూమపానం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు.
దూమపానం చేసే వారి ఊపిరితిత్తులు త్వరగా పాడవుతాయని తద్వారా వాటి శక్తి తగ్గి ఊపిరి పీల్చడం ఇబ్బందిగా మారిపోతుందని అది చివరకు ప్రాణాంత కంగా మారుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పల్మనరీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫీసర్ డాక్టర్ రాకేష్, క్యాప్ కోఆర్డినేటర్ కుమార స్వామి, మెడిసిటి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చదువుతున్న 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.