26-11-2025 12:00:00 AM
ఘట్ కేసర్, నవంబర్ 25 (విజయక్రాంతి) : వెంకటాపూర్ అనురాగ్ విశ్వవిద్యాలయంలోని సిఎస్‌ఈ విభాగం ద్వారా టెక్ హాక్ 4 జాతీయ హ్యాకథాన్ పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయంలోని 11 సాంకేతిక క్లబ్ల సహకారంతో అనురాగ్ హకోరియో క్లబ్, సిఎస్‌ఐ స్టూడెంట్ చాప్టర్ నిర్వహించిన ఫ్లాగ్షిప్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ టెక్ హాక్ 4ను గర్వంగా ప్రకటించింది.
ఈకార్యక్రమం కొత్త టెక్నాలజీల పట్ల మక్కువ ఉన్న విద్యార్థులలో సృజనాత్మకత, సమస్య పరిష్కారం, అనుభవపూర్వక అభ్యాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. టెక్ హాక్ 4 యొక్క అధికారిక పోస్టర్ను డీన్ లు డాక్టర్ వి. విజయ కుమార్, డాక్టర్ జి. విష్ణు మూర్తి, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ జి. బలరామ్లతో పాటు ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ తరానాసింగ్, అమిత మిశ్రా ఆవిష్కరించారు.