17-10-2025 12:12:15 AM
వెంకగారి భూమయ్య :
విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో తమ ఆర్థిక, నిత్య జీవిత అవసరాల కోసం అప్పులు చేయడం, వాటిని తీర్చలేక కొందరు పెన్షనర్లు ఆత్యహత్యలకు పాల్పడడం లాంటి సంఘటనలు కోకొల్లలు. ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు పెన్షనర్లకు సత్వరమే న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రభుత్వానికి తమ జీవిత సారా న్ని సేవగా అంకితం చేసిన వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు నేడు కనీస ఆర్థిక భద్రత కోసం పరితపిస్తూ కన్నీరు పెడుతుండడం శోచనీయం. తమ న్యాయమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఇవాళ వీళ్లం తా రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. ఈ దు స్థితికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ.. రాష్ర్ట ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
పదవీ విరమణ బకాయిలను తక్షణమే చెల్లించకపోతే, రిలే నిరాహార దీక్షలతో రా ష్ర్టవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పెన్షనర్ల సంఘం అల్టిమేటం ఇచ్చిం ది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలం లో పదవీ విరమణ పొందిన పెన్షనర్లందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెం ట్ బకాయిలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉ న్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి ఆర్థిక భద్రత కల్పించే కీలక ప్రయోజనాలైన గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, సరెండర్ లీవ్స్ (లీవ్ ఎన్‌క్యాష్ మెంట్) వంటి మొత్తాలను ప్రభుత్వం ఒకేసారి చెల్లించాలి.
ఉద్యోగుల స్థాయి, సర్వీ సును బట్టి ఒక్కొక్కరికి రూ. 35 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు అందాల్సిన ఈ మొత్తం చెల్లింపుల్లో జరుగుతున్న జా ప్యం వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోం ది. రాష్ర్టవ్యాప్తంగా ఈ పెండింగ్ బకాయి ల విలువ సుమారు రూ. 8 వేల కోట్ల వర కు ఉంటుందని అంచనా. ఆర్థిక భారంతో పెన్షనర్లకు రావాల్సిన తమ సొంత సొ మ్మును ఇవ్వకుండా ప్రభుత్వ నిర్లక్ష్య ధోర ణి ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది.
ఆత్మహత్యల పర్వం
పదవీ విరమణ ప్రయోజనాలు సకాలంలో చేతికి అందక అనేక మంది పె న్షనర్ మిత్రులు అకాల మరణం పాలవుతున్నారని, సరైన వైద్యం చేయించుకోలేక జీవితాలను కోల్పోతున్నారని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక నాయకులు త మ ఆవేదనను, గోడును వెల్లబోసుకున్నారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమ యంలో తమ ఆర్థిక, నిత్య జీవిత అవసరాల కోసం అప్పులు చేయడం, వాటిని తీ ర్చలేక కొందరు పెన్షనర్లు ఆత్యహత్యలకు పాల్పడడం లాంటి సంఘటనలు రాష్ట్రం లో కోకొల్లలుగా ఉన్నాయి.
ఈ నేపథ్యం లో పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత విద్య, కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల వంటి అత్యవసర అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన హా మీల మేరకు బకాయిలను తక్షణమే చెల్లించాలని రిటైర్డ్ పెన్షనర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. సాధారణ రెగ్యులర్ పెన్షనర్లతో పాటు, పదవీ విరమణ పొందిన ప్రతి ఒక్కరికీ బకాయిలను అందజేయాలని కోరిం ది. పెన్షనరీ సదుపాయాలు సకాలంలో అందక పెన్షనర్లు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో, ఆయా కుటుంబాల సభ్యుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరముంది.
ఒకేసారి అందాల్సిన రిటైర్మెంట్ బకాయిలతో పాటు, ప్రతి నెలా పెన్షన్‌తో పాటు జీవన వ్యయానికి అనుగుణంగా అందాల్సిన డియర్‌నెస్ రిలీఫ్ బకాయిలను సైతం ప్రభుత్వం సకాలంలో విడుదల చేయడం లేదు. ఈ కరువు భత్యం చెల్లింపులో జాప్యం జరగడం వల్ల పెన్షనర్లు నిత్యం పెరుగుతున్న ఖర్చులతో తీవ్ర ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇది కూడా పెన్షనర్ల ఆందోళనకు ఒక ప్రధాన కార ణం.
తాము ప్రభుత్వానికి ఎన్నో సంవత్సరాలు సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఈ ప్రయోజనాలను హక్కుగా అడుగుతున్నామని సంఘం పేర్కొంది.ప్రభుత్వం నిధుల లేమిని కారణంగా చూపి, ఇతర సంక్షేమ పథకాలకు నిధులు మళ్లిస్తూ, తమ సొంత డబ్బు విషయంలో నిర్లక్ష్యం వహించడం అత్యంత అన్యాయమని, ఇది ఆర్థిక క్రమశిక్షణారాహిత్యమని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదేశాలు భేఖాతరు
గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై అనేక మం ది పెన్షనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను నిర్ణీత గడువులోగా వడ్డీ తో సహా చెల్లించాలని ప్రభుత్వాన్ని స్పష్టం గా ఆదేశించింది. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను కూడా రాష్ర్ట ప్రభుత్వం పూర్తి గా లెక్కచేయకుండా, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని పెన్షనరీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ తీరు, పాలకులకు పౌరుల హక్కులపై ఉన్న గౌరవాన్ని ప్రశ్నిస్తోంది. తమకు రావాల్సిన సొమ్ము కోసం కోర్టుకు వెళ్లి న్యాయం తమ వైపు ఉందని సంబరపడుతున్నప్పటికీ, ప్రభు త్వం స్పందించకపోవడం దారుణమని పెన్షనర్లు వాపోతున్నారు. దేశ మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనే రిటైర్డ్ ఉద్యోగుల బాధ వర్ణణాతీతంగా మారిపోయింది.
భరోసా ఏదీ?
పెన్షనర్ల సమస్యపై సరైనటువంటి స్పం దన చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే పరిస్థితి చేయి దా టిపోయే అవకాశముందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వాపోయింది. ఈ సమస్య ను రాష్ర్ట నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించింది. పెండింగ్ బకాయిల తో పాటు ఇతర పెన్షనరీ సమస్యలపై కూ డా ఏకకాలంలో రిలే నిరాహార దీక్షలకు సిద్ధమవుతామని స్పష్టం చేసింది. ‘హక్కుల కోసం మరోసారి ఉద్యమం చేయడానికి మేమెప్పుడు సిద్ధం’ అంటూ పెన్షనర్లంద రూ అధైర్య పడకుండా పోరాటానికి సన్న ద్ధం కావాలని సంఘం పిలుపునిచ్చింది.
పారదర్శకతతో కూడిన పాలనను ఆశిస్తున్న తమకు ఈ జాప్యం తీవ్ర నిరాశను మిగుల్చుతోందని పెన్షనర్ల సంఘం ఆం దోళన వ్యక్తం చేసింది. సకాలంలో తమ సొంత డబ్బు అందకపోవడం వల్ల ఆర్థికం గా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉ ద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. నిధులు లేవనే సాకుతో సాకులు చెప్పకుండా, ప్రజల ఆరోగ్య భద్రతకు, పెన్షనర్ల గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9848559863