26-09-2024 12:03:29 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రపంచంలో టాప్-100 బిజినెస్ స్కూల్స్ జాబితాలో హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) స్థానం సంపాదించింది. ఆయా స్కూల్స్‌లో ఆఫర్ చేసే ఎంబీఏ కోర్సులకుగాను తాజాగా విడుదలైన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ గ్లోబల్ 2025 జాబితాలో ఐఎస్‌బీ హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని మరో మూడు ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు) టాప్- 100లో ఉన్నాయి. అవి.. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తాలు. యూఎస్‌లోని స్టాన్‌ఫోర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ జాబితాలో అగ్రస్థానం సంపాదించింది.