15-11-2025 08:11:55 PM
కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని 45వ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజీమ్ కోరారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. త్వరలో పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు అజీమ్ తెలిపారు.