15-11-2025 08:14:20 PM
మున్సిపల్ కమిషనర్ శైలజ
మేడిపల్లి (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వస్థ్య నగరం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 100% టి.బి. నిర్మూలన కార్యక్రమాన్ని తెలంగాణలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం మున్సిపాలిటిలను ఎంపిక చేశారని బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ శైలజ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మూడు నెలల పాటు ప్రతి రోజు వార్డ్ ల వారిగా వార్డు ఆఫీసర్, వార్డ్ సూపెరవైసర్ ల ఆధ్వర్యములో డి. ఎమ్. ఎచ్. ఓ, సర్వీసెస్ ద్వారా దగ్గరగా వున్న కమ్యూనిటీ హాల్ లో చెస్ట్ ఎక్సరే తీయించి టి. బి. స్క్రీనింగ్ చేయించడం జరుగుతుందని చెప్పారు.
ఈ పరీక్షల్లో టీ బీ లక్షణాలు ఉన్న వారికి తెమడ పరీక్ష చేయబడుతుందని టీ. బి. ఉన్నట్లు తెలితే ప్రత్యేక డాక్టర్ బృందంచే ట్రీట్మెంట్ ఇప్పిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు టి. బి. స్క్రీనింగ్ టెస్ట్ లో పాల్గొనాలని కమిషనర్ కోరారు. కోరుతున్నాము. శనివారం తిరుమల మిడాస్, 11వ డివిజన్, ఆర్. ఎన్. ఎస్. కాలనీ, 14 వ డివిజన్ యందు కమ్యూనిటీ హాల్ యందు టీ. బి. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.