15-11-2025 08:12:12 PM
కాళేశ్వరం (విజయక్రాంతి): శ్రీ కాళేశ్వర ముక్తిశ్వరా స్వామి వారి ఆలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణలు పూజలు చేశారు. వీరు ఆలయం వద్దకు రాగ ఆలయం అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. ఆలయం లో పూజలు చేసాక అర్చకులు ఆశీర్వాదం చేసి స్వామి వారి ప్రసాదం అందజేశారు. వీరి వెంట అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రఫీ, మర్రి సతీష్ యాదవ్, బి. మురళి కుమార్, సత్యం సంపత్, మనోజ్ తదితరులు ఉన్నారు.