calender_icon.png 2 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద సహాయం పకడ్బందీగా చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

02-09-2025 12:21:57 AM

రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, సెప్టెంబర్ చివరి వరకూ డిజాస్టర్ ఫండ్ వినియోగ రిపోర్టు (యూసీ)లు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, రోడ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన సహాయం అందించాలన్నారు.సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించిన వివరాల ప్రకారం, జిల్లాలో ఒకరు గల్లంతయ్యారు, 38 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 561 ఎకరాల్లో పంట నష్టం, 3 పశువుల మృతి సంభవించిందన్నారు.