calender_icon.png 2 September, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులపై కక్ష కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం

02-09-2025 12:27:38 AM

నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు

భూత్పూర్: రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్ మున్సిపాలిటీ పట్టణంలో రైతులకు యూరియా అందించలేకపోతుందని రైతులు పట్టణంలోని చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న రైతులకు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేసీఆర్ పదేళ్ల  ప్రభుత్వ పాలనలో ఒకరోజు కూడా రైతులు క్యూ లైన్ లో నిల్చోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులకు 15 రోజులైనా కూడా ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోయిందని వారు మండిపడ్డారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు యూరియా రైతులకు అందజేస్తున్నామని చెబుతున్నారని మీరు యూరియాను అందజేస్తే రైతులు ఎందుకు నిరసనలు తెలుపుతున్నారన్నారు. ఎనిమిది మంది బిజెపి ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా కూడా రైతులకు యూరియా బస్తాలను ఇప్పించడంలో విఫలమయ్యారన్నారు. రైతులకు రేపు మధ్యాహ్నం వరకు యూరియాను అందించకుంటే మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం లోనే రైతులు రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతులు నిరసనలు తెలపలేదన్నారు. 15 రోజుల్లో మూడుసార్లైన రైతులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారని, అధికారులు వచ్చి హామీలు ఇచ్చినా కూడా యూరియాను రైతులకు అందించడం లేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ముందుగానే యూరియాను అందుబాటులో ఉంచి రైతులకు అందజేశామన్నారు.