calender_icon.png 2 September, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లలలో రాజకీయ పార్టీలు మోసపూరిత వైఖరిని అవలంబిస్తున్నాయి

02-09-2025 12:51:57 AM

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు 

ఖైరతాబాద్, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): బీసీల రిజర్వేషన్ల విషయంలో బిజెపి, కాంగ్రెస్ , బి ఆర్ ఎస్ పార్టీలు మోసపూరిత వైఖరిని అవలంబిస్తున్నాయని రౌండ్ టేబుల్ సమావేశంలో  పలువురు బీసీ మేధావులు విమర్శిం చారు. సోమవారం బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు -సాధ్యాసాద్యాలపై సోమాజిగూడ లో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి ఈశ్వరయ్య గౌడ్ మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం కులగణన వివరాలు బయట పెట్టకుండా దగా చేస్తుందని అన్నారు. కాంగ్రెస్, బిజెపి లు చిత్తశుద్ధి తో వ్యవహరించడం లేదని విమర్శించారు. అనంతరం ఫోరం చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్లు అంశంలో కాంగ్రెస్ పార్టీ మొదట బిల్లు తేవడం తర్వాత ఆర్డినెన్స్ తేవడం, తర్వాత మల్లి జీవో తెస్తా అనడం వారి అసంబద్ధ విధానాలకు ఉదాహరణలని అన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  ద్రుష్టి పెట్టడం లేదన్నారు.