02-09-2025 12:21:40 AM
హైదరాబాద్, సెప్టెంబర్1(విజయక్రాంతి) : కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టు మంగళవా రం వాయిదా వేసింది. మధ్యంతర ఉపశమనంపై కోర్టు నిర్ణయం తీసుకోలేదు. పిటిషనర్ల తరఫు న్యాయవాది అత్యవసర విచారణను కోరుతూ, నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్ధించారు.
అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఈ విషయాన్ని మంగళవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను సాధారణ కేసుల మాదిరిగానే విచారిస్తామని న్యా యస్థానం స్పష్టం చేసింది. మంగళవారం ఉదయం ౧౦.౩౦ గంటలకు విచారణ చేపడతామని తెలిపింది. అప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వలేమని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
మరోవైపు కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం నిర్ణయం తెలుసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని (జీపీ) సీజే ధర్మాసనం కోరింది. రేపు లేదా ఎల్లుండి చెబుతా మని ఆయన బదులిచ్చారు. రేపటి వరకు ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని హైకోర్టు ఆయన్ని ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది.కాగా కాళేశ్వ రం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై జరిపిస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ లు, ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉన్నందున సీబీఐ విచారణే సరైనదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.దీంతో సోమవారం కేసీఆర్, హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మంగళవారం జరగనున్న హైకోర్టు తీర్పుపై సర్వ త్రా ఆసక్తి నెలకొంది.