calender_icon.png 2 September, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరాలజీ సర్జరీల్లో రోబోల యుగం

02-09-2025 12:52:56 AM

ఏఐఎన్యూ ఆధ్వర్యంలో రోబో-ల్యాప్ సదస్సులో వైద్య నిపుణులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): యూరాలజీ విభాగంలో చేసే శస్త్రచికిత్సల్లో రోబోల యుగం వచ్చేసిందని, అమెరికా లాంటి దేశాల్లో అయితే అది తప్పనిసరి కూడా అయ్యిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సల వల్ల తమ కు ఇబ్బంది తక్కువనే భావన అందరిలోనూ వచ్చిందని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెప్పారు.

ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆధ్వ ర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రోబో-ల్యాప్ సదస్సులో పలువురు విదేశీ వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. యూరలాజికల్ చికిత్సల విషయంలో రోబోటిక్, లాప్రోస్కొపిక్ చికిత్సలలో వస్తున్న సరికొత్త టెక్నాలజీలపై చర్చించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలతో పాటు ఇంగ్లండ్, అమెరికా, బెల్జియం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలం క లాంటి దేశాల నుంచి కలిపి మొత్తం వెయ్యి మందికి పైగా యూరాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు.

రెండు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో పలు వర్క్ షాప్‌లు, సంక్లిష్టమైన కేసుల గురించిన చర్చలు, భవిష్యత్తు టెక్నాలజీలు యూరాలజీ, నెఫ్రాలజీ చికిత్సలను ఎలా మారుస్తాయన్న అంశంపై సమీక్షలు జరిగాయి. ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి మల్లికార్జున మాట్లాడుతూ.. రోబో-ల్యాప్ 2025 సద స్సు కేవలం శస్త్రచికిత్సల్లో వస్తున్న కొత్త మా ర్పులు ప్రదర్శించడానికి కాదు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులంతా ఒక్క వేదికమీదకు చేరి, వారి ఆలోచనలు పంచుకుని యూరాలజీ చికిత్సల భవిష్యత్తును సమిష్టిగా పునర్నిర్వచిం చాలన్నదే మా ఉద్దేశం అన్నారు. “యూరాలజీ రంగంలో అత్యున్నత స్థాయి చికిత్సలు, నిరంతర అధ్యయనం, సాంకేతిక ఆవిష్కరణల దిశగా ఏఐఎన్యూ నిబద్ధతను రోబో-ల్యాప్ సదస్సు ప్రతిబింబిస్తుందరి ఏఐఎన్యూ సీఈఓ సందీప్ గూడూరు అన్నారు.