calender_icon.png 27 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్తడి చిత్తడిగా మారిన దారులు

27-09-2025 12:10:42 AM

మాగనూరు సెప్టెంబర్ 26: మాగనూరు మండలంలో గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మండలంలోని రహదారు లు చిక్కడి చిక్కడిగా మారి బాటసారులకు ,ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతుందని ఆయా గ్రామ ప్రజలు అంటున్నా రు. మాగనూరు మండల కేంద్రం నుంచి అచ్చంపేట, పెగ డ బండ , నుండి అడివి స త్కారం గ్రామాలకు వెళ్లే రహదారులు గుం తలు గుంతలుగా ఏర్పడి గుంతల్లో నీరు నిలువ ఉండడం వల్ల రహదారి చిక్కడి చిక్కడిగా ఉండడంతో వాహనదారులు క్రింద పడిన సంఘటనలు ఉన్నాయన్నారు, భయముతో ప్రయాణం చేయవలసి వస్తుంద న్నారు.

ప్రధానంగా మాగనూరు పెద్ద చెరు వు కింది భాగము నుంచి వెళ్లే రహదారి పూ ర్తిగా ధ్వంసం కావడంతో ఎప్పుడు ఈ ప్రమాదము జరుగుతుందోనని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారుల గుండా మాగనూరు మండల కేంద్రాని కి వివిధ పనుల నిమిత్తం చాలామంది కాలినడకన వాహనాలపై వస్తుంటారు. ఈ యొ క్క రహదారు లకు మరమ్మతులు చేయించ లా ని ఆయా గ్రామ ప్రజలు సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధులనుకోరుతున్నారు.