calender_icon.png 13 September, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ59

05-12-2024 04:38:35 PM

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రోబా-3 మిషన్‌ను దాని విశ్వసనీయ PSLV-C59 రాకెట్‌లో గురువారం విజయవంతంగా ప్రయోగించింది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష సహకారంలో ప్రధాన మైలురాయి. సాఫీగా జరిగిన కౌంట్‌డౌన్ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 4:04 గంటలకు ప్రయోగం జరిగింది. బుధవారం నాడే ఈ ప్రయోగం చేయాల్సి ఉండగా, వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గురవారానికి రీషెడ్యూల్ చేయబడింది. వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రోబా-3 ఉపగ్రహాలను మోసుకెళ్తుంది. ప్రోబా-3 ఉపగ్రహాలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినవి. ప్రోబా-3 ఉపగ్రహాలు సూర్యడి కరోనాపై పరిశోధనలు చేయనున్నాయి. కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా-3 రూపకల్పన చేశారు. కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించి కరోనాను శోధించడం ప్రోబా-3 ప్రత్యేకత.