calender_icon.png 23 December, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్‌లకు సవాళ్లు..?

23-12-2025 12:00:00 AM

గ్రామపంచాయతీల్లో 

పేరుకుపోయిన సమస్యలు

దాదాపు రెండేళ్ల తర్వాత 

కొలువుదీరిన పాలకవర్గాలు

సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం పూర్తి

15వ ఆర్థిక సంఘం నిధులపైనే గంపెడాశలు

హామీలు నెరవేర్చడంలో

విఫలమయితే పరిస్థితి ఏంటి..? 

వనపర్తి, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : ఇటీవల మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెం బర్లు ఆయా గ్రామాల ప్రజల సమక్షంలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహించారు. కాగా జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని ఆయా గ్రా మాల్లో నూతన సర్పంచులు వార్డు సభ్యులకు సమస్యలు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. నువ్వా నేనా అంటూ బరిలో దిగిన సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఖర్చులకు మించి లక్షల రూపాయలు, మద్యం, భోజనం వంటి వాటికీ ఖర్చులు చేశారు. పదవి దక్కిన నూతన సర్పంచులకు పెట్టిన ఖర్చు రికవరీ పరిస్థితి దేవుడు ఎరుగు రెండేళ్లు గా అభివృద్ధికి నోచుకోని గ్రామాలు పలు సమస్య లతో సవాలు విసురు తున్నాయి. 

మెజారిటీ గ్రామ పంచాయతీల్లో సిసి రోడ్లు, మురికి కాలువలు వంటి అభివృద్ధి పనుల కోసం గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరొక వైపు గ్రామ పంచాయతీ పరిధిలో వీధి దీపాల బిల్లులు, గతంలో పని చేసిన ఆగిపోయిన అభివృద్ధి పనులకు సంబందించిన పెం డింగ్ బిల్లులు, డంపింగ్ యార్డ్ ల, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, మంచి నీటి సమస్య, ఇతర సమస్య లు నూతన పాలక వర్గాలకు పెను భారంగా మారడంతో ఎలా ప్రగతి పథంలో  తీసుకెళ్లాయనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.

దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామ పంచాయతీ 

పాలక వర్గాలు కొలువు..

దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీ పాలకవర్గాలు కొలువు తీరబోతున్నాయి. 2019లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు ఆయా పాలకవర్గల పదవి కాలం 2024 జనవరిలో ముగిసింది అప్పటినుంచి ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలసలో కొనసాగుతూ వచ్చాయి.  పాలకవర్గా లు లేకపోవడంతో 15 వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయి.

దీనికి తోడు పాలక వర్గాలు లేకపోవడం మేజర్ గ్రామ పంచాయతీ లలో రావాల్సిన ఆదాయం రాకపోవడం తో గ్రామ అభివృద్ధి పనులకు సంబందించి చిన్న చిన్న అవసరాలకు అప్పులు చేయా ల్సిన పరిస్థితి ఉందని గతంలో పంచాయతీ కార్యదర్శులు బహిరంగానే చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.  చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌కు సంబందించి మర మ్మతు లు, డీజిల్ వంటి వాటికీ నిధులు లేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. 

15వ ఆర్థిక సంఘం నిధులపైనే గంపెడాశలు..

గత రెండేళ్లు గా పాలక వర్గం లేకపోవడం ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన అభివృద్ధి పనులకు సంబందించి పెండింగ్ బిల్లులు, గ్రామాల్లో నెలకొన్న సమస్య లకు పరిష్కారం కావాలంటే 15 వ ఆర్థిక సంఘం నిధుల పైనే గంపేడు ఆశలను నూతన పాలక వర్గం పెట్టుకుంది. ఆ నిధులు మంజూరు అయితేనే గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టె అవకాశాలు ఉండగా నిధుల మంజూరు ఆలస్యం అయితే గ్రామ ప్రజల నుండి ఒత్తిడి తప్పే పరిస్థితి ఉంటాయని సమస్యలన్నిటిని ఎదుర్కొని ఎలా ముందుకు పాలకవర్గాలు ఉంటాయనేది ఇప్పుడు సర్వత్ర చర్చంచానీయంగా మారింది. 

హామీలు నెరవేర్చడంలో విఫలమయితే 

పరిస్థితి ఏంటి...? 

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థి హామీలను మించి అభ్యర్థులు హామీలను ఇచ్చి ఎన్నికల్లో ఫోటి చేశారు. ఉహించిన దానికంటే ఖర్చులు తడిసి మోపెడు కావడం ఒక పక్క అయితే అరచేతిలో ప్రపంచం కావడం ఇచ్చి న ప్రతి హామీని ప్రజలు గుర్తుకు పెట్టుకుని మరి ప్రశ్నించే త్వ త్వం రావడం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే తమ పరిస్థి తి ఏంటోనన్న ఆలోచన నూతన సర్పంచులకు మొదలైంది.