16-09-2025 12:43:15 AM
బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రం లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని సూ చించింది.
తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలా గే బుధవారం, గురువారాల్లోనూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.