calender_icon.png 16 September, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండను టీబీ రహిత జిల్లాగా మార్చాలి

16-09-2025 12:43:16 AM

  1. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరాలి  
  2. ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ  

నల్లగొండ టౌన్ సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): నల్గొండ జిల్లాను టీబి రహిత, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు . సోమవారం అయన మహాత్మా గాంధీ విశ్వవిద్యా లయం నాల్గవ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం, నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదీత్య భవన్లో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో లతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమ లుపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముందుగా రాష్ట్ర గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ నల్గొండ జిల్లాలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో వైటిపిఎస్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య, విద్య ,జల్ జీవన్, ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ పథకం, సమగ్ర శిక్ష అభియాన్,  భవిత కేంద్రాలు గ్రామ సడక్ యోజన,

టి బి ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, స్వచ్ఛభారత్, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, గృహ నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఆబ జన జాతీయ యోజన, ఆది కర్మయోగి అభియాన్, తదితర పథకాలపై లెక్క లతో సహా వివరించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతల పై వివరాలను తెలియజేశారు.వివిధ రంగాలకు చెందిన  ప్రముఖులు లయన్ డిస్టిక్ గవర్నర్ మదన్ మోహన్,

ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, వైద్యులు జయప్రకాశ్ రెడ్డి,సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా, కవి సగర్ల సత్తయ్య,దుశ్చర్ల సత్యనారాయణ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణ కాంత్ నాయక్, రైతు రాంరెడ్డి, పదవతరగతి జిల్లా టాపర్ విద్యార్థిని అమూ ల్య, హెచ్‌ఐవి పై పనిచేస్తున్న సంఘసంస్కర్త మేరీ తదితరులు వారు చేస్తున్న రంగాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గవర్నర్ కు వివరించారు.

జిల్లా అధికారులతో ముఖాముఖి సందర్భంగా జిల్లా క్షయ నియంత్రణ అధికారి  డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాసులు జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, చికిత్స, తదితర అంశాలను వివరించారు. 

అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ క్షయ వ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు ఉన్న అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో టీబీ పట్ల అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నివారణకు సొసైటీలో అందరినీ భాగస్వామ్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కవు లు, కళాకారులు , రచయితలు వివిధ రంగాలలోని ప్రముఖులను టీబి ముక్త్ భారత్ లో భాగస్వాములను చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబిని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూ రు రఘువీర్ రెడ్డికి సూచించారు.

టి బి నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబి  ముక్త్ భారత్ కార్యక్రమానికి భారత ప్రధాని సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం పై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని వర్గాల ప్రజల  అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, గ్రామాలలో సర్పంచ్ లను చురుకుగా పాల్గొనే విధంగా చూడాలని, కవులు, కళాకారులు, రచయితల ద్వా రా సాంఘిక నాటకాలు, నాటికలు, పద్యా లు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని, టీబికి వ్యతిరేకంగా అందర్నీ భాగ స్వాములు చేయాలని సూచించారు.   

విశ్వవిద్యాలయ వీసీలు మొదలుకొని కింది స్థాయి వరకు అందరూ భాగస్వాములు అయితే టీబి, మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించవచ్చని, అప్పుడు నల్గొండ జిల్లా ను టీబి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్ద వచ్చన్నారు.  నల్గొండ జిల్లాలో వైద్యం, ఆరోగ్యం, విద్య పథకాల అమలు పట్ల ఆయన జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు. పోషణ అభియాన్ తో పాటు, ఇతర పథకాలు అమలు చేస్తుండడం పట్ల కితాబునిచ్చారు. పౌష్టికాహారం టి బి నివారణ, మాదకద్రవ్య నివారణ, తదితర పథకా లలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంపీ రఘువీర్రెడ్డిలు రాష్ట్ర గవర్నర్‌ను శాలువా, మేమేంటోతో సత్కరించారు. నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుం దూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు నల్గొండ జిల్లాలో టీబి నివారణకు ముఖ్యుల సలహాలు తీసుకోవడమే కాకుండా, జిల్లా యంత్రాంగంతో కలిసి పని చేస్తామన్నారు. మిర్యాలగూడలో  వాతావరణ కాలుష్యం ,టీబి వంటి వ్యాధులు సోకడానికి ఆస్కారం ఉందని ,ఆ ప్రాంతంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి టీబి నివారణకు కృషి చేస్తామన్నా రు. 

పట్టణాలలో గాంజా వాడకం  నివారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,  మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు  కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, డిఎఫ్‌ఓ రాజశేఖర్ ,రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు , తదితరులు పాల్గొన్నారు.