12-09-2025 12:04:05 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట.సెప్టెంబరు 11(విజయక్రాంతి) : అటవీ భూములను సంరక్షించాల్సి న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబర్లో అటవీ శాఖ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అటవీ భూములు లింగంపల్లి చిన్న జట్రం బోయిన్పల్లి కోటకొండ అమ్మిరెడ్డిపల్లి తిరుమలపూ ర్ అభంగాపూర్ ఎక్లాస్పూర్ బెహరం కొండ , ధన్వాడ మండలంలోని కొండాపూర్ కిష్టాపూర్ గుట్టూరు ,
మద్దూరు పల్లెర్ల తదితర గ్రామాలలో అటవి భూమి ఉందని తెలిపా రు. పి ఓ బి భూభారతి క్రింద కొన్ని టాలీ కావడం లేదని అధికారులు తెలిపారు. అసైన్మెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ వెరిఫై చే యాలి తహసీల్దార్ లు సర్వ్ నెంబర్ ద్వారా రికారడ్స్ వెరిఫై చేయాలని వారం రోజుల పూర్తి చేయాలని ఆదేశించినారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ శ్రీను ఫారెస్ట్ అధికారి ప్రసాద్ రెడ్డి,ఏడి సర్వేయర్ ఆర్డిఓ రామచందర్ నారాయణపేట తాసిల్దార్ అమరేందర్ ధన్వాడ తహసీల్దార్ సింధుజ అధికారులు తదితరులుపాల్గొన్నారు..