24-09-2025 12:32:06 AM
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కే. కాశీనాథ్
నారాయణపేట.సెప్టెంబర్,23(విజయక్రాంతి): నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లె గడ్డ గ్రామానికి గత కొన్ని రోజుల నుండి ఎండోమెంట్ అధికారులు వారి ఎండలు ఖాళీ చేయమని నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఇట్టి విషయమై పరిశీలించుటకు సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ నారాయణపేట డివిజన్ కార్యదర్శి కె.కాశీనాథ్, జిల్లా నాయకులు బి రాము సందర్శించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కె.కాశీనాథ్ మాట్లాడుతూ ..పల్లె గడ్డ గ్రామంలో తాతల తండ్రుల కాలం నుండి ఇదే క్రమంలో జీవిస్తున్నారు. ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ గ్రామంలో ప్రభుత్వాలు పాఠశాల, గ్రామపంచాయతీ కార్యాలయం, ఇతర కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో ఎండోమెంట్ అధికారులు, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం చిన్న రాజముర్ ట్రస్టు అధికారులు మీరు నిర్మించుకున్న ఇండ్లను వెంటనే వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్లాలని నోటీసు జారీ చేశారు.
అదే రకంగా హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ కు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. ఈ రకంగా పల్లె గడ్డ గ్రామ ప్రజలకు ఇండ్లు ఖాళీ చేయమని నోటీసులు పంపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదని కాశీనాథ్ తెలిపారు. దీనిని మాస్ లైన్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అన్నారు.
ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలన్నారు. ప్రజలు తరఫున మాస్ లైన్ పార్టీ పల్లె గడ్డకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, రాములు, చెన్నయ్య, గ్రామ ప్రజలు యువకులు తదితరులుపాల్గొన్నారు.