calender_icon.png 3 November, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురాతన ఆలయాలను రక్షించుకోవడం మన ధర్మం

02-11-2025 10:40:59 PM

బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి

తాడ్వాయి (విజయక్రాంతి): పురాతన ఆలయాలను రక్షించుకోవడం హిందువుగా మన ధర్మమని బిజెపి రాష్ట్ర నాయకులు, ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట భీమేశ్వర ఆలయం శాశ్వత మండపాన్ని రెండు లక్షల 50 వేలతో నిర్మించారు. ఆ మండపాన్ని పైడి ఎల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన ఆలయాలను కాపాడడం హిందువుగా పుట్టిన మన బాధ్యత అని అన్నారు. పునర్నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కలగడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భీమేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల, సంతాయి పేట్ గ్రామాల ప్రజలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.