calender_icon.png 3 November, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి

02-11-2025 10:44:06 PM

నకిరేకల్ (విజయక్రాంతి): కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన మండలంలోని నెల్లిబండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడలో ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న పొనుగంటి కిరణ్ కుమార్, తన భార్య సంధ్యారాణి(36)తో కలిసి తన స్వగ్రామం వరంగల్ లోని గొర్రెకుంటకు బయలుదేరారు. నెల్లిబండ శివారులో రహదారిపై ఎదురుగా బైక్ పై వస్తున్న కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన వారణాసి మహేందర్(19) యువకుడిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు బోల్తా పడి అందులో ఉన్న సంధ్యారాణి అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై వస్తున్న మహేందర్, కారులో ఉన్న కిరణ్ కుమార్ కు తీవ్ర గాయాలు కాగా వీరిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ద్విచక్ర వాహనదారుడు మహేందర్ మృతి చెందాడు. మహేందర్ పెదనాన్న కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేష్ గౌడ్ తెలిపారు.