11-09-2025 01:11:40 AM
100% అటెండెన్స్ ఉంటే రూ.10016 అందిస్తాం అన్న రిషి విద్యాసంస్థల డైరెక్టర్ వెంకటయ్య
సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 10(విజయక్రాంతి): మీ చేతుల్లో మీ జీవితం ఉందని చదువు ఒక్కటే మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని మహబూబ్ నగర్ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పయనీర్ ఎప్సెట్, నీట్ ఎం ట్రెన్స్ టెస్ట్ శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
అ నంతరం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమంలో ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ రిటై ర్డ్ ఉద్యోగులకు అవసరమైన సదుపాయా లు అన్ని ప్రభుత్వం అందుబాటులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ ర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల పండుకు తమ నిధుల నుండి రూ 5 లక్షలు అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గత విద్యాసంవత్సరం పయనీ ర్ కార్యక్రమం లో అద్భుతమైన ఫలితాలు విద్యార్థులు సాధించారని, 200 మంది వి ద్యార్థులు శిక్షణ తీసుకొనగా, 116 మంది వి ద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి వివిధ ప్రొఫేషనల్ కోర్సుల్లో చేరారని , ఈ విద్యా సంవత్సరం వంద శాతం ఉత్తమ ర్యాంకుల ను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో ఎప్సెట్, నీట్ ఎంట్రెన్స్ శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.
100% అటెండెన్స్ ఉన్న విద్యార్థు లకు రూ 10116 ల నగదును అందిస్తానని రిషి విద్యాసంస్థల డైరెక్టర్ వెంకటయ్య చె ప్పడం గొప్ప విషయం అన్నారు. చదువుకు పాలమూరు నియోజకవర్గంలో అత్యధిక ప్రాథమిక ఇవ్వడం జరుగుతుందని మీరందరూ చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవా లని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిజె బెనహార్, డి ఐఇఓ కౌసర్ జహాన్, బాలుర జూనియర్ క ళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, ప్రభుత్వ ఎంవిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భీం రెడ్డి, ఒకేషనల్ జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ జంగయ్య, రిషి విద్యాసంస్థల డైరెక్టర్ వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.