11-09-2025 01:11:39 AM
-ఐఐఎంసి కళాశాలలో జాతీయ సదస్సు
ఖైరతాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వారి సౌజన్యంతో ఐఐఎంసి తెలుగు శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి సంస్థ ఆధ్వర్యంలో దాశరథి కృష్ణమాచార్య, కాళోజి నారాయణ రావు, సి. నారాయణరెడ్డి, దాశరథి రంగా చార్య జయంతులను పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఐఐఎంసి కళాశాలలో బుధవారం ’సాహితీ మూర్తుల సాహిత్య సమాలోచన’ జాతీయ సదస్సును నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షులు ఇటికాల పురుషోత్తం చేతుల మీదుగా 92 మంది పత్ర సమర్పకుల చేత రాయబడిన ‘వ్యాస సంగ్రహల సంకలనం‘ ఆవిష్కరించారు. అనంతరం నలుగురు సాహితీవేత్తలను ఉద్దేశించి డా. రజిని, డా.మసన చిన్నప్ప, తెలం గాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామో జు బాలాచారి మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను తెలియజేశారు .
నలుగురు సాహి తీవేత్తల జీవితం సాహిత్యాలపై ప్రము ఖ కవులు పూర్వ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిదారెడ్డి, తెరసం అధ్యక్షులు నాలేశ్వరం శంకరం కీలక ఉపన్యాసాన్ని ఇస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాళోజి దాశరథి రంగాచార్య వేదిక, కృష్ణమాచార్య వేదిక, సినారె వేదికలుగా జరిగిన పత్ర సమర్పణలో మొత్తం 80 మంది పత్ర సమర్పకులు నలుగురు సాహితీవేత్తల భిన్న రచనలను ఎంచుకొని అందులో ఉన్న చాలా అంశాలను ఉద్విగ్న భరితంగా, విశ్లేషణాత్మకంగా వివరించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాశిం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, ఆత్మీయ అతిథి బడే సాబ్ సదస్సును ఉద్దేశించి తెలంగాణ సాహిత్య చరిత్రలో ప్రముఖ కవులైన నలుగురిపై జాతీయ సదస్సు నిర్వహించడం చాలా గొప్ప విషయమని మాట్లాడారు. కృష్ణమాచార్య కూతురు ఇందిర, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు వంగపల్లి విశ్వనాథం, తెలుగు శాఖ సంచాలకులు రామకృష్ణ పాల్గొన్నారకు. మంద సురేఖ, కడవెండి మమత(కాళోజిపై), పద్మారాణి, శ్రీ భాష్యం అనురాధ (దా. కృష్ణమాచార్య పై), షమియుల్లా , పరమేశ్వరి (సినారె పై), శ్వేత సుబ్బారావు (దా.రంగాచార్య పై) ఉత్తమ పత్ర సమర్పకులుగా ఎంపిక చేసి మొదటి బహుమతి 1500 రూపాయలు, రెండవ బహుమతి వెయ్యి రూపాయలు మరియు ప్రశంస పత్రాన్ని ముఖ్య అతిథులు అందజేశారు.